విద్యుదాఘాతంతో రైతులకు తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2020-12-11T05:32:35+05:30 IST

బోరు మోటారు పైపులను పైకితీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై నలుగురు రైతులకు తీవ్రగాయాలయ్యాయి.

విద్యుదాఘాతంతో రైతులకు తీవ్ర గాయాలు

బోరు మోటారు పైపులను పైకి తీస్తున్న క్రమంలో ఘటన


మిరుదొడ్డి, డిసెంబరు 10: బోరు మోటారు పైపులను పైకితీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై నలుగురు రైతులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు రాములు, స్వామి, రాములు, మల్లేశం కలిసి అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలం వద్ద బోరుమోటారు నుంచి పైపులను పైకి తీస్తున్నారు. ఈ క్రమంలో 11కేవీ విద్యుత్తు వైర్లకు పైపులు తగలడంతో వాటిని పట్టుకోని ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించి స్థానికులు సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ మల్లేశం, స్వామి చికిత్స పొందుతుండగా మిగిలిన ఇద్దరు రైతులను మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌కు తరలించారు. కుటుంబ సభ్యులను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Updated Date - 2020-12-11T05:32:35+05:30 IST