పట్టణ ప్రగతిలో సేవా నిరతి కనిపిస్తున్నది

ABN , First Publish Date - 2020-03-02T11:21:04+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ వార్డుల్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్నదని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ

పట్టణ ప్రగతిలో సేవా నిరతి కనిపిస్తున్నది

  • పట్టణ ప్రగతితో మహిళలకు అవగాహన
  • పట్టణాల్లో ప్రతి శుక్రవారం ‘డ్రై’ డే
  • రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి వెల్లడి

తూప్రాన్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ వార్డుల్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్నదని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తూప్రాన్‌ పట్టణంలో చేపట్టిన పట్టణ ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌తో కలిసి మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన చెత్త, చెదారం, పాత ఇళ్లు తొలగింపును చైర్మన్లు, కౌన్సిలర్లు చేపడుతున్నారన్నారు. పట్టణ ప్రగతితో సమాజంలో సేవ అనేది కనిపిస్తుందని ప్రతా్‌పరెడ్డి అన్నారు. అవగాహన లేకపోవడంతో తడి, పొడి చెత్తను వేరుచేయకపోవడంతో దుర్గంధం వెలువడి వ్యాధులు వ్యాపించే ప్రమాదముందన్నారు. పట్టణ ప్రగతితో మహిళలకు అవగాహన కల్పించడంతో చెత్తను బయట వేయకుండా నివారించగలుగుతున్నామన్నారు. మున్సిపాలిటీల్లో ప్రతి శుక్రవారం ’డ్రై’ డేగా నిర్ణయించి, పొడి చెత్తను తొలగిస్తామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 30 అడుగుల రోడ్లు ఉండాలని, అలా కాకుండే గృహాలను నిర్మిస్తే కూల్చేందుకు వెనుకాడమన్నారు. డివిజన్‌ కేంద్రంగా ఉన్న తూప్రాన్‌ హైవే రోడ్డు పొడవునా షాపింగ్‌ కాంప్లెక్స్‌లు అభివృద్ధి చేస్తామన్నారు. ‘చెత్త లేని పట్టణం’గా తూప్రాన్‌ పట్టణాన్ని మార్చడానికి ముఖ్యమంత్రిలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ ఏర్పాటు చేస్తానన్నారు. ఇందుకు పట్టణంలోని ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. తూప్రాన్‌ పోలీసుస్టేషన్‌ వెనుక పోలీసులు నిలువ చేసిన సీజు వాహనాలు, రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైన వాహనాలను తొలగించకపోవడంతో చెత్త పేరుకుపోతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఖాజామొహిజుద్ధీన్‌, వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ పల్లెర్ల జ్యోతిరవీందర్‌గుప్తా, పట్టణ అధ్యక్షుడు సరాఫ్‌ సతీ్‌షచారి, పార్టీ నాయకులు బస్వన్నగారి సత్యనారాయణగౌడ్‌, మాచిరెడ్డి కృష్ణారెడ్డి, పసుల నారాయణ, ఉపేందర్‌, ఆంజాగౌడ్‌, అజహర్‌, సత్తార్‌, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-03-02T11:21:04+05:30 IST