మున్సిపాలిటీల్లో సర్వర్‌ డౌన్‌.. ఆన్‌లైన్‌ సేవలకు ఆటంకం

ABN , First Publish Date - 2020-12-17T05:54:07+05:30 IST

మున్సిపాలిటీల్లో ఆన్‌లైన్‌ సేవలు సర్వర్‌ సమస్యలతో తరుచూ నిలిచిపోతున్నాయి. మున్సిపాలిటీల్లో సర్వర్‌లో వచ్చిన సాంకేతిక లోపాన్ని సరి చేయకపోవడంతో వివిధ రకాల సేవలు రెండు నెలలుగా నిలిచిపోయాయి. మ్యుటేషన్లు (ఆస్తి మార్పిడి) జరగడం లేదు. ఇంటి నంబర్లు కేటాయించడం లేదు. నల్లా బిల్లుల చెల్లింపుల్లేవు.

మున్సిపాలిటీల్లో సర్వర్‌ డౌన్‌.. ఆన్‌లైన్‌ సేవలకు ఆటంకం

మ్యుటేషన్‌, ఇంటి నంబర్‌, పన్ను చెల్లింపులకు అంతరాయం

బల్దియాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు


సంగారెడ్డి టౌన్‌, డిసెంబరు 16 : మున్సిపాలిటీల్లో ఆన్‌లైన్‌ సేవలు సర్వర్‌ సమస్యలతో తరుచూ నిలిచిపోతున్నాయి. మున్సిపాలిటీల్లో సర్వర్‌లో వచ్చిన సాంకేతిక లోపాన్ని సరి చేయకపోవడంతో వివిధ రకాల సేవలు రెండు నెలలుగా నిలిచిపోయాయి. మ్యుటేషన్లు (ఆస్తి మార్పిడి) జరగడం లేదు. ఇంటి నంబర్లు కేటాయించడం లేదు. నల్లా బిల్లుల చెల్లింపుల్లేవు. జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీలుండగా వందల సంఖ్యలో వివిధ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. జిల్లాలోని సంగారెడ్డి, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, సదాశివపేట, అందోల్‌-జోగిపేట, అమీన్‌పూర్‌, ఐడీఏ బొల్లారం, తెల్లాపూర్‌, పురపాలికల్లో మ్యుటేషన్‌కు సంబంధించి దాదాపు 1,500 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. అలాగే 2 వేలకు పైగా ఇంటి నంబర్‌ కేటాయింపు దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, నల్లాబిల్లులు చెల్లించినప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదని అధికారులు తెలిపారు. రెండు నెలలుగా వివిధ సేవలు నిలిచిపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ఇప్పటికైనా సాంకేతిక సమస్యను పరిష్కరించి, మున్సిపాలిటీల్లో నిలిచిపోయిన సేవలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2020-12-17T05:54:07+05:30 IST