హబ్షీపూర్‌లో గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
ABN , First Publish Date - 2020-12-30T05:38:59+05:30 IST
దుబ్బాక మండలంలోని హబ్షీపూర్‌లో ఒక కిరాణ దుకాణంలో అక్రమంగా నిలువ ఉంచిన గుట్కా ప్యాకెట్లను మంగళవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

దుబ్బాక, డిసెంబరు 29: దుబ్బాక మండలంలోని హబ్షీపూర్‌లో ఒక కిరాణ దుకాణంలో అక్రమంగా నిలువ ఉంచిన గుట్కా ప్యాకెట్లను మంగళవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. గ్రామానికి చెందిన మధుకర్ కిరాణ దుకాణంలో సుమారు రూ. 2లక్షల విలువ చేసే గుట్కా, టుబాకో, ఇతర ముడిసరుకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు టాస్క్‌పోర్స్ సీఐ ప్రసాద్ తెలిపారు.
హుస్నాబాద్: హుస్నాబాద్ మండలం కూచనపల్లి గ్రామానికి చెందిన మామిడి వెంకటేశ్ ఇంట్లో మంగళవారం రూ.30వేల విలువైన గుట్కా,అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ శ్రీధర్ తెలిపారు.