సంగారెడ్డిలో సస్పెండైన మున్సిపల్ కార్మికుడి నిరసన
ABN , First Publish Date - 2020-12-29T15:00:03+05:30 IST
జిల్లాలో సస్పెండైన మున్సిపల్ కార్మికుడు నరహరి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
సంగారెడ్డి: జిల్లాలో సస్పెండైన మున్సిపల్ కార్మికుడు నరహరి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. డ్యూటీలోకి తీసుకొమ్మంటే సానిటరీ ఇన్స్ పెక్టర్ లంచం కోసం వేధిస్తున్నాడని ఆరోపించాడు. తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మున్సిపల్ కార్మికునికి నచ్చజెప్పి కిందికి దించారు.