కేతకీ సంఘమేశ్వరాలయంలోకి వర్షపు నీరు

ABN , First Publish Date - 2020-10-14T15:17:39+05:30 IST

జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షానికి ఝరాసంఘంలో కేతకీ సంఘమేశ్వరాలయంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది.

కేతకీ సంఘమేశ్వరాలయంలోకి వర్షపు నీరు

సంగారెడ్డి: జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షానికి ఝరాసంఘంలో కేతకీ సంఘమేశ్వరాలయంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఆలయంలోని గర్భగుడి, ఆఫీస్‌ రూం నీటితో నిండిపోయింది. 2015లో ఇదే స్థాయిలో భారీ వర్షాలు కురవడంతో ఆలయం నీటితో నిండిపోగా... 2020లో మరోసారి కేతకీ సంఘమేశ్వరాలయంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది నీటిని తొలగించారు. 

Updated Date - 2020-10-14T15:17:39+05:30 IST