తెల్లకార్డు లబ్ధిదారులకు బియ్యం

ABN , First Publish Date - 2020-03-23T06:51:23+05:30 IST

ప్రభుత్వం నిర్ణయించినట్లుగా 12 కిలోల చొప్పున రేషన్‌ బియ్యం ఇచ్చేందుకు జిల్లాలో సరుకులు అందుబాటులో ఉన్నట్లు జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి శ్రీనివాస్‌...

తెల్లకార్డు లబ్ధిదారులకు బియ్యం

  • ప్రభుత్వ ఆదేశాలతో పంపిణీ
  • జిల్లా పౌరసరఫరా అధికారి శ్రీనివాస్‌


మెదక్‌ రూరల్‌, మార్చి 22: ప్రభుత్వం నిర్ణయించినట్లుగా 12 కిలోల చొప్పున రేషన్‌ బియ్యం ఇచ్చేందుకు జిల్లాలో సరుకులు అందుబాటులో ఉన్నట్లు జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కరోనా వల్ల ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్న ప్రభుత్వ నిర్ణయంతో ముఖ్యమంత్రి రేషన్‌ కార్డు కలిగిన ప్రతి సభ్యుడికి 12 కిలోల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2,13,729 కార్డులు ఉన్నాయన్నారు.


ఇందులో 7,08,002 మంది రేషన్‌ బియ్యం పొందుతున్న లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రస్తుతం లబ్ధిదారుడికి 4 కిలోల చొప్పున అందజేస్తుందన్నారు. కరోనా వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కార్డులో ఉన్న ప్రతీ ఒక్కరికి 12 కిలోల చొప్పున అందించనున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన  బియ్యం జిల్లాలో అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ప్రభుత్వం నుంచి అదేశాలు వచ్చిన వెంటనే లబ్ధిదారులకు పెంచిన బియ్యాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-03-23T06:51:23+05:30 IST