అధికారులపై చర్యలకు నివేదిక
ABN , First Publish Date - 2020-03-16T07:46:46+05:30 IST
మనూరు మండలం బెల్లాపూర్‌లో చర్చి నిర్మాణ సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులపై కఠిన చర్యల కోసం కలెక్టర్ హన్మంతరావు, తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నివేదించారని జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
నారాయణఖేడ్, మార్చి 15 : మనూరు మండలం బెల్లాపూర్‌లో చర్చి నిర్మాణ సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులపై కఠిన చర్యల కోసం కలెక్టర్ హన్మంతరావు, తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నివేదించారని జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. చర్చి నిర్మాణం కోసం 2016-17లో మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా రూ.10 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు.
నిధుల దుర్వినియోగం జరిగిందని వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి తిరుపతిరావును విచారణాఽధికారిగా నియమించి విచారణ జరిపించారని తెలిపారు. విరాళాల ద్వారా వచ్చిన డబ్బులతో పనులు చేయించి ప్రభుత్వ నిధులు రూ.10 లక్షలు దుర్వినియోగం చేశారని విచారణలో తేలిందని పేర్కొన్నారు. అప్పటి మనూరు ఇన్‌చార్జి ఎంపీడీవో మల్లేశ్వర్‌రావు, పీఆర్ ఏఈ మొగులయ్య, డీఈఈ శ్రీనివాస్ నిధుల దుర్వినియోగానికి కారకులని విచారణలో వెలుగులోకి వచ్చిందని తెలిపారు. వారిపై కఠిన చర్యలు కోసం ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు నివేదించారని కలెక్టర్ పేర్కొన్నారు.