సన్నాలకు మద్దతు ధర చెల్లించాలని రాస్తారోకో
ABN , First Publish Date - 2020-11-27T05:33:48+05:30 IST
సన్న రకం ధాన్యానికి రూ.2,500 మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం అక్కన్నపేట మండలం గౌరవెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఎదుట రైతులు రాస్తారోకో నిర్వహించారు.

అక్కన్నపేట, నవంబరు 26: సన్న రకం ధాన్యానికి రూ.2,500 మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం అక్కన్నపేట మండలం గౌరవెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఎదుట రైతులు రాస్తారోకో నిర్వహించారు. ధాన్యానికి నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. నియంత్రత సాగును పాటిస్తూ సన్నాలను పండిస్తే ప్రభుత్వం మద్దతు ధర కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లతో కుమ్మక్కై క్వింటాలుకు 8 నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఆరోపించారు. రూ.2,500 మద్దతు ధరను ప్రకటించి, ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమానికి సీపీఐ, బీజేపీ నాయకులు కొమ్ముల భాస్కర్, కర్ణకంటి నరేష్, శ్రీనివాస్ మద్దతు ప్రకటించారు.