ప్రభుత్వ భూమిని దున్నేసిన రంగారెడ్డి రైతులు

ABN , First Publish Date - 2020-06-18T11:09:58+05:30 IST

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌కు చెందిన కొందరు రైతులు.. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని

ప్రభుత్వ భూమిని దున్నేసిన రంగారెడ్డి రైతులు

రామచంద్రాపురం, జూన్‌ 17: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌కు చెందిన కొందరు రైతులు.. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెలలో సర్వే నంబరు 434లోని ప్రభుత్వ భూమిని బుధవారం నాగళ్లతో దున్నేశారు. స్థానికులు తహసీల్దార్‌ కె.శివకుమార్‌కు విషయాన్ని చేరవేశారు. తహసీల్దార్‌ ఆదేశాలతో ఘటనా స్థలానికి చేరుకున్న వీఆర్వో రాజమల్లేశం రైతులను అడ్డుకున్నారు. ఈ భూములు మావే అంటూ రైతులు వీఆర్వోతో వాగ్వాదం చేశారు. 

Updated Date - 2020-06-18T11:09:58+05:30 IST