వాన కురిసె..రైతు మురిసె

ABN , First Publish Date - 2020-08-11T11:21:56+05:30 IST

జిల్లావాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై రాత్రి వర్షం వచ్చినా

వాన కురిసె..రైతు మురిసె

జిల్లా అంతటా వర్షాలు

చెరువులు కుంటల్లోకి నీరు

పంటలకు ప్రయోజనం


మెదక్‌, ఆగస్టు 10: జిల్లావాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై రాత్రి వర్షం వచ్చినా తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా జల్లులు కురుస్తున్నాయి. జిల్లాలో 2.8 సెంటీమీటర్ల  సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిజాంపేటలో 49.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాట్లకు పొలాలను సిద్ధం చేసుకున్న రైతులు వర్షానికి నాట్లు పూర్తి చేస్తున్నారు. కొల్చారం, హవేళీఘణపూర్‌, మెదక్‌, పాపన్నపేట ప్రాంతాల్లో ఇప్పటికే నాట్లు పూర్తవగా పంట ఎదగడానికి ఈ వాన ఉపకరిస్తుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఎరువులు చల్లుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా వరినాట్లు పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 


కొల్చారం: మంజీరా నదిపై ఎనగండ్ల వద్ద నిర్మించిన చెక్‌డ్యాం సోమవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి పొంగిపొర్లుతున్నది. చెక్‌డ్యాంలో పుష్కలంగా నీరు చేరడంతో ఈ పంటకు ఢోకాలేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


జిల్లాలో నమోదైన వర్షపాతం

నిజాంపేట 49.3 మి.మీ.

పెద్దశంకరంపేట 30.4 మి.మీ.

రేగోడ్‌ 44 మి.మీ.

పాపన్నపేట 45 మి.మీ.

కొల్చారం 38.5 మి.మీ.

నార్సింగి 41.5 మి.మీ.

మెదక్‌ 29.0 మి.మీ.

చిలప్‌చెడ్‌ 34.0 మి.మీ.

Updated Date - 2020-08-11T11:21:56+05:30 IST