డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో క్వారంటైన్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2020-04-05T10:11:55+05:30 IST

ప్రభుత్వ క్వారంటైన్‌కు ఉపయోగించే విధంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో వసతుల కల్పనకు పనులు

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో క్వారంటైన్‌ ఏర్పాటు

అధికారులకు కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆదేశం


మెదక్‌ రూరల్‌, ఏప్రిల్‌ 4 : ప్రభుత్వ క్వారంటైన్‌కు ఉపయోగించే విధంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో వసతుల కల్పనకు పనులు వేగవంతం చేయాలని మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. శనివారం పట్టణ శివారులోని పిల్లికొట్టాల్‌ వద్ద గల డబుల్‌ బెడ్‌రూంల నిర్మాణాల్లో జరుగుతున్న పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు, కాంట్రాక్టర్లకు తగు సూచనలు చేశారు.


ప్రస్తుతం రెండు బ్లాక్‌లలో అవసరమైన వసతులను కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటిలో నీటి వసతితో పాటు విద్యుత్‌, ఫ్యాన్‌ బెడ్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డీవో సాయిరాంకు సూచించారు. 

Updated Date - 2020-04-05T10:11:55+05:30 IST