కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు

ABN , First Publish Date - 2020-12-31T05:28:21+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం హమాలీలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
చేర్యాల మార్కెట్‌యార్డులో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న హమాలీ కార్మికులు

చేర్యాల, డిసెంబరు 30: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం హమాలీలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.  వ్యవసాయాఽధారితంగా జీవించే రైతులు, హమాలీ కార్మికుల పొట్ట కొట్టేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలను అమలుచేయడం తగదని మండిపడ్డారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ నాయకురాలు దాసరి కళావతి, సీపీఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట్‌మావో, నాయకులు రాళ్లబండి నాగరాజు, లక్ష్మయ్య, వెంకటేశ్‌, చంద్రారెడ్డి, కనకయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


కార్మిక చట్టాలను రద్దు చేయాలి


దుబ్బాక, డిసెంబరు 30: కార్మికులకు అన్యాయం చేసేవిధంగా ఉన్న కేంద్రం తెచ్చిన నాలుగు కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం దుబ్బాక మున్సిపాలిటీలోని లచ్చపేట వార్డులో కార్మికులతో కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్మికులు శంకర్‌, రాజు, రవి, భాను, శ్రీశైలం, కుమార్‌, మల్లేశం, బాల్‌రాజు పాల్గొన్నారు.


ప్రధాని దిష్టిబొమ్మ దహనం


మిరుదొడ్డి, డిసెంబరు 30: పెరిగిన గ్యాస్‌ ధరలను నిరసిస్తూ మిరుదొడ్డిలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను సీపీఎం మండల కార్యదర్శి మొగుళ్ల భిక్షపతి ఆధ్వర్యంలో దహనం చేశారు. పేద ప్రజల నడ్డి విరిచేవిధంగా కేంద్రప్రభుత్వ నిత్యావసరాల ధరలను పెంచడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి మద్దెల అంజయ్య, నాయకులు క్రాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-31T05:28:21+05:30 IST