ప్రాథమిక విద్యా వ్యవస్థలోని సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-12-17T05:59:57+05:30 IST
ప్రాథమిక విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

సిద్దిపేట ఎడ్యుకేషన్, డిసెంబరు 16: ప్రాథమిక విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యకు పునాది అయిన ప్రాథమిక పాఠశాల విద్యను బలోపేతం చేయాలని కోరారు. తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కును కల్పించాలని, పాఠాశాల్లో మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సంతో్‌షరెడ్డి, నాయకులు పద్మారెడ్డి, త్రివిక్రమ్‌శర్మ, భాస్కర్, సత్యనారాయణ, సురేందర్, రామిరెడ్డి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.