కరోనా భయంతో 200 కోళ్లను వదిలేసి వెళ్లిపోయిన గుర్తుతెలియని వ్యక్తులు!

ABN , First Publish Date - 2020-03-18T13:26:04+05:30 IST

కరోనా వ్యాధి కోళ్ల ద్వారానే వ్యాపిస్తుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, గుర్తుతెలియని వ్యక్తులు కోళ్లను...

కరోనా భయంతో 200 కోళ్లను వదిలేసి వెళ్లిపోయిన గుర్తుతెలియని వ్యక్తులు!

జహీరాబాద్: కరోనా వ్యాధి కోళ్ల ద్వారానే వ్యాపిస్తుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, గుర్తుతెలియని వ్యక్తులు కోళ్లను నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. మంగళవారం ఉదయం జహీరాబాద్ సమీపంలోని భరత్‌నగర్, అల్లానా రోడ్డు పక్కన కోళ్లను కొందరు వ్యక్తులు వదిలేసి వెళ్లారు. ఈ వార్త పట్టణంలో దావానలంలా వ్యాపించడంతో పాటు వీడియోల ద్వారా వైరల్ అయింది. విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు అక్కడికి వెళ్లి కోళ్లను తీసుకెళ్లగా మరికొందరు వాటిని చూసి వెళ్లిపోయారు. ఈ విషయమై కమిషనర్ విక్రం సింహారెడ్డిని వివరణ కోరగా కోళ్లను వదిలేసిన మాట వాస్తవమేనని, సుమారు 200 వరకూ ఉంటాయని తెలిపారు. అందులో కొన్నింటిని ప్రజలు తీసుకుపోగా మరికొన్నింటిని అక్కడే గుంతను తవ్వి కప్పేసినట్లు తెలిపారు.

Updated Date - 2020-03-18T13:26:04+05:30 IST