‘పది’ పరీక్షలు వాయిదా

ABN , First Publish Date - 2020-03-21T10:52:32+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసిందని డీఈవో నాంపల్లి రాజేశ్‌ ఒక

‘పది’ పరీక్షలు వాయిదా

  • నేటి పరీక్ష యథాతథం:  డీఈవో నాంపల్లి రాజేశ్‌

సంగారెడ్డి అర్బన్‌, మార్చి 20 : కరోనా వైరస్‌ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసిందని  డీఈవో నాంపల్లి రాజేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం జరగనున్న సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్ష యథావిధిగా జరుగుతుందని ఆయన తెలిపారు. సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరిగే పరీక్షలు మాత్రం వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. 

అయితే వాయిదా పడిన పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది ప్రభుత్వ ఆదేశానుసారం తర్వాత ప్రకటిస్తామని డీఈవో రాజేశ్‌ తెలిపారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి తదుపరి ప్రకటన కోసం వేచి చూడాలని డీఈవో రాజేశ్‌ సూచించారు.

Updated Date - 2020-03-21T10:52:32+05:30 IST