ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-03-02T11:16:27+05:30 IST

తంగళ్లపల్లి పరిధిలోని సింగరాయ గుండం సమీపంలో గల మోయతుమ్మెద వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 ట్రాక్టర్లను ఆదివారం పోలీసులు

ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు

  • అడ్డుకున్న గ్రామస్థులు

కోహెడ: తంగళ్లపల్లి పరిధిలోని సింగరాయ గుండం సమీపంలో గల మోయతుమ్మెద వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 5 ట్రాక్టర్లను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ రాజకుమార్‌ తెలిపిన వివారాల ప్రకారం వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ట్రాక్టర్లను సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించే సమయంలో గ్రామాల అవసరాల మేరకే ఇసుకను తీసుకువస్తున్నారని, సీజ్‌ చేయొద్దంటూ గ్రామస్థులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ఇసుక రవాణ చేస్తున్నందునే ట్రాక్టర్లను పట్టుకున్నట్లు గ్రామస్థులకు ఎస్‌ఐ వివరించి స్టేషన్‌కు తరలించారు. 5 ట్రాక్టర్ల యజమానులు, ఇద్దరు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-03-02T11:16:27+05:30 IST