ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. కానీ 24గంటల్లోనే అడ్డంగా దొరికిపోయింది..!

ABN , First Publish Date - 2020-11-13T21:24:40+05:30 IST

ఓ మహిళ కట్టుకున్న భర్తనే ప్రియుడి సహాయంతో కడతేర్చి చివరికి కటకటాలపాలయింది. కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులో ఈ నెల పదో తేదీ మంగళవారం రాత్రి దుద్దెడ గ్రామానికి చెందిన మేక శ్రీనివాస్‌ (46) హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన విషయం బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన 24 గంటలలోపే గజ్వేల్‌ ఏసీపీ నారాయణ,

ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. కానీ 24గంటల్లోనే అడ్డంగా దొరికిపోయింది..!

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు


కొండపాక/మెదక్ (ఆంధ్రజ్యోతి): ఓ మహిళ కట్టుకున్న భర్తనే ప్రియుడి సహాయంతో కడతేర్చి చివరికి కటకటాలపాలయింది. కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులో ఈ నెల పదో తేదీ మంగళవారం రాత్రి దుద్దెడ గ్రామానికి చెందిన మేక శ్రీనివాస్‌ (46) హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన విషయం బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన 24 గంటలలోపే గజ్వేల్‌ ఏసీపీ నారాయణ, తొగుట సీఐ రవీందర్‌, కుకునూర్‌పల్లి ఎస్‌ఐ సాయిరాం దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. గురువారం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిన సమావేశంలో తొగుట సీఐ రవీందర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన మేక శ్రీనివాస్‌ తన భార్య రాజేశ్వరి, ఇద్దరు కొడుకులతో కలిసి సిద్దిపేట పట్టణంలోని వివేకానంద కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఇమాంబాద్‌ గ్రామానికి చెందిన ముత్యాల శ్రీనివాస్‌కు హత్యకు గురైన మ్యాక శ్రీనివాస్‌ భార్య రాజేశ్వరితో వివాహేతర సంబంధం ఏర్పడింది. 


భర్త శ్రీనివాస్‌ తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య రాజేశ్వరి ప్రియుడు ముత్యాల శ్రీనివాస్‌తో కలిసి హత్య చేసేందుకు పథకం రచించింది. పదో తేదీ రాత్రి మ్యాక శ్రీనివా్‌సకు బాగా మద్యం తాగించారు. ఆ మత్తులో పథకం ప్రకారం అతడిని దుద్దెడ గ్రామ శివారులో పత్తి చేనులోకి తీసుకెళ్లి అక్కడ ఇనుప పైపుతో తలపై, ముఖంపై కొట్టగా బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్‌ చనిపోయిన తర్వాత నిందితులిద్దరూ హత్య చేయడానికి ఉపయోగించిన ఇనుపరాడ్‌ను గ్రామ శివారులోని దర్గా కమాన్‌ వద్ద ఉన్న కోళ్ల ఫారాల వద్ద పడవేసి సిద్దిపేటకు వెళ్లిపోయారు. పోలీసులు తమదైన శైలిలో భార్యను విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారికి ఇద్దరు కుమారలున్నారు. నిందితులిద్దరిని గురువారం రిమాండ్‌కు తరలించినట్లు తొగుట సీఐ రవీందర్‌ తెలిపారు.

Updated Date - 2020-11-13T21:24:40+05:30 IST