మీసేవకు మా వందనం

ABN , First Publish Date - 2020-03-23T06:57:29+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని పారదోలేందుకు శ్రమిస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఇతరులు అందరికీ...

మీసేవకు మా వందనం

మెదక్‌ అర్బన్‌, మార్చి 22 : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని పారదోలేందుకు శ్రమిస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఇతరులు అందరికీ సెల్యూట్‌ చేశారు మెదక్‌ ప్రజలు. జిల్లా కేంద్రంలోని ప్రజలు ఉదయం నుంచి ఇంట్లోనే ఉండి సాయంత్రం 5 గంటలకు బయటకొచ్చి చప్పట్లు కొట్టారు. మరికొందరు అన్నం తినే పళ్లెం తీసుకుని దానిమీద గరిటెతో తమ సంఘీభావాన్ని తెలియజేశారు. మెదక్‌ సబ్‌ జైలులో ఖైదీలతో కలిసి జైలు పర్యవేక్షులు సుధాకర్‌రెడ్డి చప్పట్లు కొట్టారు. చప్పట్లతో సంఘీభావం తెలిసిన వారిలో మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, 32 వార్డుల కౌన్సిటర్లు, వివిధ పార్టీల నేతలు, అన్నివర్గాల ప్రజలు పాల్గొన్నారు.


చప్పట్లు కొట్టి ఎమ్మెల్యే పద్మారెడ్డి సంఘీభావం

ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా కరోనా వైర్‌సను ఎదుర్కోవడంలో కృషిచేస్తున్న వైద్య, పారిశుధ్య, ఇతర సిబ్బందికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. ఆదివారం తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి కర్ప్యూలో పాల్గొన్నారు. అమ్మతో కలిసి వంటలు చేశారు. మొక్కలకు నీరు పోశారు. 24 గంటల స్వీయ నిర్బంధంలో ఉన్న నియోజకవర్గ ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. 

Updated Date - 2020-03-23T06:57:29+05:30 IST