గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్టు
ABN , First Publish Date - 2020-11-27T05:56:33+05:30 IST
సంగారెడ్డి క్రైం, నవంబరు 26 : గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ.శాస్ర్తి తెలిపారు.

సంగారెడ్డి క్రైం, నవంబరు 26 : గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ.శాస్ర్తి తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చీలపల్లితండాకు చెందిన రాథోడ్ బన్సీలాల్ అలియాస్ జాదవ్ బన్సీలాల్ (44) ఒడిషా నుంచి జహీరాబాద్‌కు పెద్దఎత్తున గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతుండేవాడు. ఒక కేసులో 508 కిలోల గంజాయి, మరో కేసులో 825 కిలోల గంజాయిని స్మగ్లింగ్ చేస్తుండడంతో రాథోడ్ బన్సీలాల్‌పై పీడీ యాక్టు నమోదు చేస్తూ కలెక్టర్, మేజిస్ర్టేట్ ఉత్తర్వులు జారీచేశారని అన్నారు.