పటాన్‌చెరు ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయను
ABN , First Publish Date - 2020-12-06T05:54:36+05:30 IST
పటాన్‌చెరు డివిజన్ కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించిన మెట్టుకుమార్‌యాదవ్ శనివారం మంత్రి హరీశ్‌రావును కలుసుకున్నారు.

మంత్రి ఆశీస్సులు తీసుకున్న కార్పొరేటర్ మెట్టుకుమార్‌యాదవ్
పటాన్‌చెరు, డిసెంబరు 5: పటాన్‌చెరు డివిజన్ కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించిన మెట్టుకుమార్‌యాదవ్ శనివారం మంత్రి హరీశ్‌రావును కలుసుకున్నారు. పటాన్‌చెరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనితీరుతో మంచి పేరు తెచ్చుకోవాలని కార్పొరేటర్ మెట్టుకుమార్‌కు మంత్రి హరీశ్‌రావు సూచించారు. కార్పోరేటర్‌గా వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. మెట్టుకుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు గూడెంమధుసూధన్‌రెడ్డి ఆశీస్సులతో కార్పొరేటర్‌గా గెలిచానన్నారు.