సన్నరకం ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తున్నారని ఆందోళన
ABN , First Publish Date - 2020-11-25T06:20:00+05:30 IST
సన్నరకం వరి ధాన్యం కొనుగోళ్లలో ఒక బస్తాకు మూడు కిలోల తరుగు తీస్తున్నారని పేర్కొంటూ మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని కస్తూర్బాకాలనీ సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళన చేశారు.

హుస్నాబాద్, నవంబరు 24: సన్నరకం వరి ధాన్యం కొనుగోళ్లలో ఒక బస్తాకు మూడు కిలోల తరుగు తీస్తున్నారని పేర్కొంటూ మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని కస్తూర్బాకాలనీ సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళన చేశారు. ఇప్పటికే సన్నరకం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయామని, ప్రస్తుతం సంచికి మూడు కిలోలు తరుగు తీయడంతో క్వింటాలుకు ఏడు కిలోలు నష్టపోతున్నామని వాపోయారు. తరుగును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల వెంట శివసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి రైతులు ఉన్నారు.