‘మన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవు’
ABN , First Publish Date - 2020-12-19T06:31:43+05:30 IST
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని మాజీ మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు.

నర్సాపూర్, డిసెంబరు 18: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని మాజీ మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె నర్సాపూర్ పట్టణంలోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేనివిధంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని విధాల అండగా నిలుస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌ఛైర్మన్ నయీమోద్దిన్, మార్కెటింగ్ డైరెక్టర్ సురారం నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.