షటర్‌ గేట్లపై నుంచి పొంగిన నారింజ వరద

ABN , First Publish Date - 2020-09-18T06:48:40+05:30 IST

మండలంలోని కొత్తూర్‌(బి) గ్రామ సమీపంలోని నారింజ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది

షటర్‌ గేట్లపై నుంచి పొంగిన నారింజ వరద

సత్వార్‌లో వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఇద్దరి మృతి 


జహీరాబాద్‌, సెప్టెంబరు 17 : మండలంలోని కొత్తూర్‌(బి) గ్రామ సమీపంలోని నారింజ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టులో నీటి స్టోరేజి సామర్థ్యం 0.85 టీఎంసీలు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకున్నది. వాగులోకి 770 క్యూసెక్కులు వరద చేరగా అదేస్థాయిలో అవుట్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు షట్టర్ల నుంచి నీళ్ల్లు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలోని పంట పొలాలులు నీట మునిగాయి. జహీరాబాద్‌ మండలంలోని సత్వార్‌ గ్రామం పిట్టలవాగు ఉధృతంగా ప్రవహించింది. బుధవారం గ్రామానికి చెందిన ఎరుపుల రాజు(40), న్యాల్‌కల్‌ మండలం హద్నూర్‌కు చెందిన మొట్లకుంట రాజు(40) వాగును దాటుతున్న క్రమంలో వరదనీటిలో  కొట్టుకుపోయారు. గ్రామ సమీపంలోని వాగుగట్లపై శవమై తేలారు. 

Updated Date - 2020-09-18T06:48:40+05:30 IST