రేపటిలోగా ఆన్‌లైన్‌ డేటా అప్‌లోడ్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-02-08T11:31:34+05:30 IST

జిల్లాలో వివిధ పనులకు సంబంధించిన వివరాలను ఆదివారంలోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ హన్మంతరావు ఆదేశించారు. సంగారెడ్డిలోని

రేపటిలోగా ఆన్‌లైన్‌ డేటా అప్‌లోడ్‌ చేయాలి

  • కలెక్టర్‌ హన్మంతరావు

సంగారెడ్డి టౌన్‌: జిల్లాలో వివిధ పనులకు సంబంధించిన వివరాలను ఆదివారంలోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ హన్మంతరావు ఆదేశించారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం సాయంత్రం మండల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు. జిల్లాలో నర్సరీలు, వైకుంఠధామాలు, డంప్‌యార్డులు, సోప్‌పిట్స్‌ తదితర వివరాలను ఆదివారం సాయంత్రంలోగా అప్‌లోడ్‌ చేసే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. శని ఆదివారాల్లో ఈజీఎస్‌ సిబ్బంది, ఎంపీడీవో, ఎంపీవో, ఏఈలతో కలిసి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో శ్రీనివా్‌సరావు, డీపీవో వెంకటేశ్వర్లు, డీఎ్‌ఫవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-08T11:31:34+05:30 IST