తూప్రాన్‌లో ఒకరికి స్వైన్‌ఫ్లూ

ABN , First Publish Date - 2020-03-02T11:12:02+05:30 IST

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి స్వైన్‌ఫ్లూ సోకింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం

తూప్రాన్‌లో ఒకరికి స్వైన్‌ఫ్లూ

  • సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స
  • కుటుంబ సభ్యులకు నివారణ మాత్రలు పంపిణీ

తూప్రాన్‌: మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి స్వైన్‌ఫ్లూ సోకింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలియగానే ఆదివారం కుటుంబీకులకు, చుట్టుపక్కల ఇళ్లల్లోని ప్రజలకు వైద్యులు స్వైన్‌ఫ్లూ నివారణ మాత్రలను పంపిణీ చేశారు. తూప్రాన్‌ పట్టణానికి చెందిన ఆగ్రోస్‌ యజమాని బొల్లికల్లి వెంకట్‌రెడ్డి(47) ఫిబ్రవరి 27న జ్వరంతో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా, 28న స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలియగానే, తూప్రాన్‌ ఆస్పత్రి వైద్యులు ఆదివారం వెంకట్‌రెడ్డి గృహానికి వెళ్లి స్వైన్‌ఫ్లూ నివారణ మాత్రలను అందజేశారు. అలాగే, చుట్టు పక్కల ఇళ్లలో కూడా అందజేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్‌రెడ్డి ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు తెలిసింది. 

Updated Date - 2020-03-02T11:12:02+05:30 IST