రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-12-21T05:00:59+05:30 IST
ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొనడంతో ఖేడ్ మండలం వెంకటాపూర్ సర్పంచు దొడ్ల నర్సమ్మ భర్త దొడ్ల కిష్టయ్య(62) మృతి చెందిన సంఘటన వెంకటాపూర్ చౌరస్తాలో చోటు చేసుకుంది.

నారాయణఖేడ్, డిసెంబరు 20: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొనడంతో ఖేడ్ మండలం వెంకటాపూర్ సర్పంచు దొడ్ల నర్సమ్మ భర్త దొడ్ల కిష్టయ్య(62) మృతి చెందిన సంఘటన వెంకటాపూర్ చౌరస్తాలో చోటు చేసుకుంది. ఖేడ్ ఎస్‌ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం... వెంకటాపూర్ గ్రామానికి చెందిన కిష్టయ్య ఇంటి నుంచి తన ద్విచక్రవాహనంపై ఖేడ్‌కు బయలు దేరారు. వెంకటాపూర్ చౌరస్తాలోని నిజాంపేట - ఖేడ్- బీదర్ 161బీ జాతీయ రహదారిపైకి రాగానే నిజాంపేట వైపు నుంచి ఖేడ్ వైపు వస్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొని కొంత దూరం వరకు ఈడ్చుకు వెళ్లింది. దీంతో కిష్టయ్య కాలు విరిగి కొంత దూరంలో పడగా, తల మొండెం నుంచి వేరై లారీ బంపర్‌లో ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
వాగులో ఈతకు వెళ్లిన వ్యక్తి...
సదాశివపేట రూరల్, డిసెంబరు 20 : ఈతకని వెళ్లి ఓ వ్యక్తి వాగులో పడి మృతిచెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... సంగారెడ్డి పట్టణానికి చెందిన గడ్డమీది యాదగిరి (24) మండలంలోని గంగకత్వ వాగులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందాడు. మృతుడి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.