వారం రోజుల్లో రైతుబంధు

ABN , First Publish Date - 2020-12-13T05:49:05+05:30 IST

పేదలకు సేవ చేయడంలోనే నిజమైన తృప్తి కలుగుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వారం రోజుల్లో రైతుబంధును అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

వారం రోజుల్లో రైతుబంధు
సిద్దిపేటలోని 22వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీశ్‌రావు

 సేవలోనే నిజమైన తృప్తి 

 నియోజకవర్గంలో రూ.34 కోట్లతో రోడ్ల నిర్మాణం 

 అన్నదాతల చైతన్యానికి రైతువేదికలు 

 ఖాతా పెద్ద వాగును కాళేశ్వరం నీటితో నింపుతాం

 రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


నంగునూరు, డిసెంబరు 12: పేదలకు సేవ చేయడంలోనే నిజమైన తృప్తి కలుగుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వారం రోజుల్లో రైతుబంధును అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. శనివారం నంగునూరు మండలం  కొండంరాజుపల్లి, ఖాతా, మైసంపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. రూ.23.34 కోట్లతో కొండంరాజుపల్లి గ్రామంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఖాతా గ్రామంలో రూ.20లక్షలతో నిర్మించిన రైతువేదికను, రూ.1.50 కోట్లతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, వడ్డెర కమ్యూనిటీ హాల్‌, ముదిరాజ్‌ కమ్యూనిటీ హాల్‌, మైసంపల్లిలో రూ.1.56 లక్షలతో డబుల్‌ బెడ్‌ రూమ్‌, డంపింగ్‌  షెడ్డును మంత్రి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. నియోజకవర్గంలో రూ.34 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. రైతు శక్తిని బలోపేతం చేసేందుకే రైతువేదికలను నిర్మిస్తున్నామన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో చిట్టచివరి గ్రామాలను కూడా అభివృద్ధి చేశామని చెప్పారు. కాళేశ్వరం నీళ్లతో ఖాతా పెద్దవాగులోని చెక్‌డ్యామ్‌లను నిండుకుండలా మారుస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీపీ జాప అరుణాదేవి, జడ్పీటీసీ ఉమావెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, మాజీ జడ్పీ వైస్‌ చైర్మన్‌ రాగుల సారయ్య, ఏఎంసీ చైర్మన్‌ ఎడ్ల సోమిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌లు కోల రమే్‌షగౌడ్‌, ఎల్లంకి మహిపాల్‌రెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షుడు కిష్టారెడ్డి, సీనియర్‌ నాయకులు దువ్వల మల్లయ్య, కోమండ్ల రాంచంద్రారెడ్డి, సర్పంచ్‌లు నారోజు విజయలక్ష్మిబ్రహ్మచారి, స్వరూపరాజెల్లయ్య, ఎంపీటీసీలు, ప్రియాంకరాజిరెడ్డి పాల్గొన్నారు.


సిద్దిపేట వైశ్య భవన్‌ రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలి 


సిద్దిపేట టౌన్‌, డిసెంబరు 12: సిద్దిపేట వైశ్య సంక్షేమ సదన్‌ భవన్‌ రాష్టానికే ఆదర్శంగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని వైశ్య సదన్‌ భవన్‌లో శనివారం బాంకెట్‌ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి రూ.2.60 కోట్ల నిఽధలు రావడం గొప్ప విషయమన్నారు. శనగలు, వడ్లు, బియ్యంపై 1 శాతం సెస్‌ మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే తొలగించడంతో, ప్రభుత్వానికి 35 శాతం ఆదాయం తగ్గిందని వివరించారు. జిన్నింగ్‌ మిల్లులలో పత్తి గింజలపై 1 శాతం సెస్‌ను తొలగించామన్నారు. త్వరితగతిన నిధులు తెచ్చి భవనాన్ని అన్నీ హంగులతో 2, 3 నెలల్లో తీర్చిదిద్దుతామని చెప్పారు. వైశ్య సంక్షేమానికి వైశ్య సంఘం ప్రతినిధి ఇల్లెందుల అంజయ్య ఎంతగానో సేవలు చేశారని గుర్తు చేశారు. పట్టణంలోని 22వ వార్డులో టీయుఎ్‌ఫఐడీసీ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ పారూఖ్‌హుస్సేన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, కొమురవెళ్లి అంజయ్య, కౌన్సిలర్‌ ప్రవీణ్‌, మున్సిపల్‌ ఈఈ వీర ప్రతాప్‌, నాయకులు పిల్లుట్ల రాజయ్య ఉన్నారు. 


Updated Date - 2020-12-13T05:49:05+05:30 IST