నూతన సంవత్సర వేడుకలు నిషేధం

ABN , First Publish Date - 2020-12-27T05:41:33+05:30 IST

నూతన సంవత్సర వేడుకలకు ఎలాంటి అనుమతి లేదని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపారు.

నూతన సంవత్సర వేడుకలు నిషేధం


 సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ

సంగారెడ్డి క్రైం, డిసెంబరు 26: నూతన సంవత్సర వేడుకలకు ఎలాంటి అనుమతి లేదని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామూహిక సంబరాలకు చెక్‌ పెట్టినట్టు చెప్పారు. సంగారెడ్డి పోలీసు డివిజన్‌ పరిధిలో 31న రాత్రి యదావిధిగా డ్రంకెన్‌డ్రైవ్‌ కొనసాగుతుందని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలంటూ ఎవరైనా రోడ్లపైకి వచ్చినా, సామూహిక పార్టీలు చేసినా, డీజేలు పెట్టినా, న్యూ ఇయర్‌ పేరిట ఈవెంట్లు నిర్వహించినా, వినోదాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సంగారెడ్డి పోలీసు డివిజన్‌ పరిధిలో ఎవరైనా న్యూ ఇయర్‌ వేడుకలు, ఈవెంట్లు ఏర్పాట్లు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 

Updated Date - 2020-12-27T05:41:33+05:30 IST