తొలి రోజు పటాన్‌చెరుకు రెండు నామినేషన్లు

ABN , First Publish Date - 2020-11-19T05:51:09+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. పటాన్‌చెరు సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్ల కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

తొలి రోజు పటాన్‌చెరుకు రెండు నామినేషన్లు
నామినేషన్‌ దాఖలు చేస్తున్న నర్రా భిక్షపతి

ఇంకా బోణీ కొట్టని రామచంద్రాపురం, భారతీనగర్‌కు డివిజన్లు


పటాన్‌చెరు, నవంబరు 18 : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. పటాన్‌చెరు సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్ల కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు పటాన్‌చెరు డివిజన్‌కు రెండు నామినేషన్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ తరఫున నర్రా భిక్షపతి నామినేషన్‌ను దాఖలు చేశారు. ఒక నామినేషన్‌ పార్టీ తరఫున, మరో సెట్‌ స్వతంత్ర అభ్యర్థిగా వేశారు. టీఆర్‌ఎస్‌ తరఫున మరో అభ్యర్థిగా మాజీ సర్పంచ్‌ దేవేందర్‌రాజు కుమారుడు ఎం.పృథ్వీరాజ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు పార్టీ బీఫారం అందజేయాల్సి ఉంది. కాగా రామచంద్రాపురం, భారతీనగర్‌ డివిజన్ల నుంచి ఒక్క నామినేషన్‌ సైతం దాఖలు కాలేదు.


Updated Date - 2020-11-19T05:51:09+05:30 IST