రోడ్డు ప్రమాదంలో కార్మికురాలి మృతి

ABN , First Publish Date - 2020-03-24T06:20:18+05:30 IST

సంగారెడ్డి మున్సిపల్‌ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికురాలు జ్యోతి సోమవారం విధులకు వస్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందింది. కొండాపూర్‌ పోలీసుల కథనం మేరకు...

రోడ్డు ప్రమాదంలో కార్మికురాలి మృతి

సంగారెడ్డి క్రైం, మార్చి 23: సంగారెడ్డి మున్సిపల్‌ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికురాలు జ్యోతి సోమవారం విధులకు వస్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందింది. కొండాపూర్‌ పోలీసుల కథనం మేరకు.. సంగారెడ్డి పట్టణానికి చెందిన వంజరిజ్యోతి (30) ఆదివారం రాత్రి కొండాపూర్‌మండలం గొల్లపల్లికి ఓ శుభకార్యానికి వెళ్లింది. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంట్రాక్టుపారిశుధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న ఆమె సోమవారం విధులకు హాజరుకావడానికి ఉదయం తెల్లవారుజామున సోదరుడు కుమార్‌తో కలిసి బైక్‌పై సంగారెడ్డికి బయలుదేరింది. ఈ క్రమంలో కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ వద్దకు రాగానే బైక్‌ అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో జ్యోతి తీవ్రంగా గాయపడి మృతి చెందింది. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా గత ఆరు నెలల క్రితం మృతురాలు జ్యోతి భర్త మల్లేశం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతురాలికి ఇద్దరు పిల్లలు  ఉన్నారు. తల్లిదండ్రులు మృతి  చెందడంతో పిల్లలు అనాథలయ్యారు.


మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలి

ప్రమాదవశాత్తు మృతి చెందిన జ్యోతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్‌ఖాన్‌ డిమాండ్‌చేశారు.    ప్రస్తుతం ప్రమాదంలో మృతి చెందిన జ్యోతి పిల్లలు ఇద్దరు అనాథలయ్యారని, వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Read more