పశుపోషణతో రైతుల ఆర్థికాభివృద్ధి

ABN , First Publish Date - 2020-12-06T06:09:06+05:30 IST

వ్యవసాయంతో పాటు అందుకు అనుబంధంగా పశుపోషణ చేస్తే రైతులకు ఎంతో మేలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారు.

పశుపోషణతో రైతుల ఆర్థికాభివృద్ధి
ఖేడ్‌ మండలం లింగాపూర్‌లో ఎమ్మెల్యేకు గొర్రె పిల్లను బహూకరిస్తున్న దృశ్యం

 ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి


నారాయణఖేడ్‌, డిసెంబరు 5: వ్యవసాయంతో పాటు అందుకు అనుబంధంగా పశుపోషణ చేస్తే రైతులకు ఎంతో మేలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారు. మండలంలోని లింగాపూర్‌లో శనివారం మేకలు, గొర్రెలకు ఉచితంగా నట్టల నివారణ మందులు వేసే శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పశువుల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం వాటిల్లితే పశుపోషణ ద్వారా ఆర్థికంగా ఇబ్బందులను అధిగమించవచ్చని వివరించారు. ప్రభుత్వం మూగజీవాలకు సోకే వ్యాధుల నివారణకు  ఉచితంగా మందులను అందిస్తున్నట్టు చెప్పారు. అనంతరం గ్రామస్థులు ఎమ్మెల్యేకు  గొర్రె పిల్లను బహుకరించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం, సర్పంచు సత్యనారాయణ, ఎంపీటీసీ లక్ష్మి, సేవాలాల్‌ సంఘం నాయకులు రమేష్‌ చౌహాన్‌,  గొర్రెల సంఘం అధ్యక్షుడు సంగయ్య, పశువైద్యాధికారి నేతాజీ, సిబ్బంది పాల్గొన్నారు.

 

పేదలకు అండగా టీఆర్‌ఎస్‌  

రాష్ట్రంలోని పేదలను అన్ని విధాలా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కూలిన గృహాలకు సంబంధించిన 58 మంది బాధితులకు శనివారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ. 3,200 చొప్పున మంజూరు కాగా ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి చెక్కుల రూపంలో బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పరమేష్‌, రవీందర్‌నాయక్‌, రమేష్‌ చౌహాన్‌, తదితరులు పాల్గొన్నారు. 


ఇల్లు కూలిన బాధితులకు పరిహారం అందజేత

నాగల్‌గిద్ద, డిసెంబరు 5: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  పేదలకు అండగా ఉంటుందని ఖేడ్‌ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు కూలిన ఇళ్లకు సంబంధించి 22 మంది బాధితులకు శనివారం నాగల్‌గిద్ద ఎంపీపీ కార్యాలయంలో నష్టపరిహారం చెక్కులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ  గ్రామాల అభివృద్ధికి, రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, రైతు సమితి మండలాధ్యక్షుడు నందుపాటిల్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పండరియాదవ్‌, ఎస్టీయూ కార్యదర్శి జీవన్‌రాథోడ్‌, ఆర్‌ఐలు శరణప్ప, ఈశ్వర్‌, 

Updated Date - 2020-12-06T06:09:06+05:30 IST