మళ్లీ ఇంటికి చేరిన అదృశ్యమైన తల్లి, పిల్లలు

ABN , First Publish Date - 2020-11-26T06:29:42+05:30 IST

అదృశ్యమైన తల్లి, ఇద్దరు పిల్లలను బుధవారం కుబుంబీకులకు అప్పగించారు

మళ్లీ ఇంటికి చేరిన అదృశ్యమైన తల్లి, పిల్లలు
తల్లీ, పిల్లను కుటుంబీకులకు అప్పగిస్తున్న పోలీసులు

చిన్నశంకరంపేట, నవంబరు 25 : మండలంలోని గజగట్లపల్లి గ్రామానికి చెందిన నవనీత భర్త యాదగిరితో గొడవపడి ఇద్దరు పిల్లలతో నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. నవనీత, పిల్లల ఆచూకీ కోసం వెతికగా ఎక్కడ దొరకకపోవడంతో నవనీత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి ఆచూకీ కోసం చర్యలు చేపట్టి ఎట్టకేలకు అదృశ్యమైన తల్లి, ఇద్దరు పిల్లలను బుధవారం కుబుంబీకులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ గౌస్‌ మాట్లాడుతూ సీసీ ఫుటేజ్‌ ఆధారంగా బుధవారం పిల్లలతో నవనీత మెదక్‌ చర్చి వద్ద కనిపించింది. వారిని పట్టుకోని నవనీత తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు.


Updated Date - 2020-11-26T06:29:42+05:30 IST