72గంటల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తాం: మంత్రి హరీష్‌రావు

ABN , First Publish Date - 2020-10-12T19:13:29+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయని.. జిల్లాలోని సింగూర్, నల్లవాగు ప్రాజెక్టులు నిండు కుండలా ఉన్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు.

72గంటల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తాం: మంత్రి హరీష్‌రావు

సంగారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయని.. జిల్లాలోని సింగూర్, నల్లవాగు ప్రాజెక్టులు నిండు కుండలా ఉన్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 54లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యిందన్నారు. అలాగే జిల్లాలో 79200 ఎకరాల్లో వరి సాగు అయినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని.. గన్నీ బస్తాలు,  ధాన్యం శుభ్రపరిచే యంత్రాలను అధికారులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఎత్తైన ప్రదేశంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ రోజు కొనుగోలు చేసిన ధాన్యం ఆరోజే గోదాములు , మిల్లులకు చేరాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోళ్లపై మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వాలన్నారు. 17శాతం లోపు తేమ శాంతంతో ధాన్యం తీసుకొస్తే 24 గంటల్లో కొనుగోలు చేస్తామని.. అలాగే 72 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, రైతుల నుంచి ప్రతిపాదనలు వస్తే రేపే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చెయాలని అధికారులకు మంత్రి హరీష్‌ రావు ఆదేశించారు. 


Updated Date - 2020-10-12T19:13:29+05:30 IST