సీఎం కేసీఆర్ పేరు నిలబెట్టాలి: మంత్రి హరీష్

ABN , First Publish Date - 2020-12-27T19:01:11+05:30 IST

సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ నగర్‌లో ఆదివారం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ జరిగింది. 168 మంది లబ్దిదారులకు మంత్రి హరీష్ రావు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

సీఎం కేసీఆర్ పేరు నిలబెట్టాలి: మంత్రి హరీష్

సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ నగర్‌లో ఆదివారం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ జరిగింది. 168 మంది లబ్దిదారులకు మంత్రి హరీష్ రావు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని పెద్దలు అనేవారని, మనిషి జీవితంలో అతి ముఖ్యమైనవి పెళ్లి, ఇల్లు అని చెప్పారు. ఈ రెండింటికీ కేసీఆర్ ప్రభుత్వం సాయం అందిస్తోందన్నారు. సొంత ఇల్లు అనేది పేదవారి ఆశయమని, ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇంటి ద్వారా ఆ ఆశయాన్ని సాధిస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ డబుల్ ఇళ్ల చుట్టూ పళ్ల చెట్లను పెట్టామని, అవి త్వరలోనే పళ్లు కూడా కాస్తాయని చెప్పారు. 


డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరులో లంచాలు వసూలు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. లబ్దిదారులు ఎవరికైనా రూపాయి లంచం ఇచ్చినట్లు చెబితే 10వేల గిఫ్ట్ ఇస్తా అని మంత్రి హరీష్ సవాల్ చేశారు. నిష్పక్షపాతంగా ఇళ్ల ఎంక్వైరీ జరిందని చెప్పారు. లబ్దిదారులు ప్రభుత్వం ఇచ్చిన ఈ ఇళ్లను వేరొకరికి అమ్మినా, అద్దెకు ఇచ్చినా కేసులు పెడతామని మంత్రి హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చారని, సీఎం కేసీఆర్ పేరు నిలబెట్టాలని లబ్దిదారులకు మంత్రి హరీష్ సూచించారు.

Updated Date - 2020-12-27T19:01:11+05:30 IST