డాక్టర్లకు సంఘీభావం తెలిపిన మంత్రి

ABN , First Publish Date - 2020-03-23T06:47:22+05:30 IST

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్న వైద్యసిబ్బందికి, పోలీస్‌, ఫైర్‌ సిబ్బందికి...

డాక్టర్లకు సంఘీభావం తెలిపిన మంత్రి

  • జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో గడిపిన హరీశ్‌రావు 

సిద్దిపేట, మార్చి 22: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్న   వైద్యసిబ్బందికి, పోలీస్‌, ఫైర్‌ సిబ్బందికి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా 5 గంటలకు చపట్లు కొట్టి కృతజ్ఞతలు చెప్పారు. కరోనా నిర్మూలనకు అందరూ సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం హైదరాబాద్‌లోని తన ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపారు. స్వచ్ఛ సిద్దిపేట విషయమై మునిసిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరైనా తమకేం కాదనే ధోరణి వద్దన్నారు. అలాంటి ధోరణి వల్లనే చైనా, ఇటలీ లాంటి దేశాలు ఎలా వణికి పోతున్నాయో చూస్తున్నామన్నారు. దేశంలో అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Updated Date - 2020-03-23T06:47:22+05:30 IST