నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ABN , First Publish Date - 2020-03-08T07:37:28+05:30 IST

జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లకు కృంగిపోకుండా స్థాపించిన పరిశ్రమను సమర్థవంతంగా నడుపుతూ 50 కుటుంబాలకు...

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

  • ఆకాశంలో సగం, అవకాశంలో సగం.. పరిపూర్ణమైన జీవన గమనంలోనూ సగమై నిలుస్తున్నది మహిళ. స్వశక్తిని నమ్ముకొని ముందుకు పయనిస్తున్నది. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన 
  • మహిళలు నేడు అన్ని రంగాల్లో దూసుకువెళ్తున్నారు. సత్కారాలు.. ఛీత్కారాలు.. అవార్డులు.. 
  • అవహేళనలు.. అన్నింటిని సమర్థంగా ఎదుర్కొంటూ సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు 
  • తెచ్చుకుంటున్నారు. వివిధ రంగాల్లో పయనిస్తున్న మహిళలపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం
  • ఆమె సంకల్పం.. అనితర సాధ్యం
  • ఆటుపోట్లే విజయ సోపానాలుగా మహిళా పారిశ్రామికవేత్త మూడు దశాబ్దాల కృషి


పటాన్‌చెరు, మార్చి 6: జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లకు కృంగిపోకుండా స్థాపించిన పరిశ్రమను సమర్థవంతంగా నడుపుతూ 50 కుటుంబాలకు ఉపాది చూపిస్తున్నారు సీనియర్‌ మహిళా పారిశ్రామికవేత్త తాళ్లూరి కమలకుమారి. పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో సుమారు 35 ఏళ్ల క్రితం చిన్న పరిశ్రమను స్థాపించడంతో ప్రారంభమైన ఆమె ప్రస్థానం నేటికీ నిరాటంకంగా సాగిపోతోంది. కమలకుమారి ఆ రోజుల్లో ఆంధ్రాయూనివర్సీటీ నుంచి కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. వివాహం అనంతరం 1976లో పటాన్‌చెరు పారిశ్రామిక వాడలోని ప్రతా్‌పస్టీల్స్‌ పరిశ్రమలో కెమి్‌స్టగా ఉధ్యోగంలో చేరారు.  ఆమె భర్త కోటేశ్వరావు సికింద్రాబాద్‌ ప్రాగాటూల్స్‌లో మెటలర్జీ మేనేజర్‌గా పనిచేసేవారు. భర్త ప్రోత్సాహం, కెమిస్ట్రీలో ఉన్న అనుభవంతో సొంత పరిశ్రమ స్థాపించాలని భావించారు. 


ఏపీ స్కూటర్స్‌ ఆర్డర్లతో పరిశ్రమ స్థాపన

పటాన్‌చెరులో ప్రారంభమైన ఏపీ స్కూటర్స్‌ పరిశ్రమ యాజమాన్యం ఇచ్చిన ప్రకటన కమలకుమారిని ఆకర్శించింది. స్కూటర్‌ యంత్ర విడిభాగాలపై ఎలకో్ట్ర ప్లేటింగ్‌ వేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఏదైనా వ్యాపారం చేయాలన్న దంపతులిద్దరిని ఆ ప్రకటన ఆకర్శించింది.  భర్త ప్రోత్సాహంతో ఆమె 1985లో పర్‌ఫెక్ట్‌ ఎలకో్ట్ర ప్లేటింగ్‌ అనే చిన్న పరిశ్రమను స్థాపించారు. పరిశ్రమను స్థాపించిన కమలకుమారికి ఆరంభంలోనే ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది.  పరిశ్రమ స్థాపించిన మూడేళ్లలో ఏపీ స్కూటర్స్‌ పరిశ్రమ నష్టాలతో మూతపడడంతో ఆర్డర్లు లేక ఒక్కసారిగా పరిశ్రమను మూసివేయాల్సిన దుస్తితి ఏర్పడింది. 


అయినా కృంగిపోకుండా తనకున్న అనుభవం, నైపుణ్యం వివరిస్తూ పలు ప్రభుత్వ రంగ సంస్థలకు దరఖాస్తు చేసుకున్నారు. చివరకు బీహెచ్‌ఈఎల్‌నుంచి ఆర్డర్లు లభించాయి. ఎలకో్ట్ర ప్లేటింగ్‌కు బదులు టర్బైన్‌ యంత్ర విడిభాగాలపై అల్యూమినియం కోటింగ్‌ వేసే ఆర్డర్లు ఇచ్చారు. స్టీల్‌ మీద కాపర్‌, నికేల్‌ కోటింగ్‌ వేయం సులువైన పని, అల్యూమినియం కోటింగ్‌ వేయడం క్లిష్టమైంది. అందుకు తగిన యంత్రాలను సమకూర్చుకుని నైపుణ్యం సాధించి మరో ప్రయత్నం ప్రారంభించారు. బీహెచ్‌ఈఎల్‌తో ప్రారంభమైన ఆర్డర్లు క్రమంగా బీడీఎల్‌, విడియా, డెన్షన్‌ హైడ్రాలిక్స్‌ తదితర భారీ పరిశ్రమలు సైతం ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించడంతో వెనక్కు తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా 1998లో రాష్ట్ర ప్రభుత్వం అవార్డును సైతం అందుకున్నారు. 


వెంటాడిన ఒంటరితనం

వ్యాపారం గాడిలో పడింది అనుకుంటున్న సమయంలో జీవితం ఒక్క సారిగా మారిపోయింది. కమలకుమారి భర్త కోటేశ్వరావు కారు ప్రమాదంలో మృతి చెందారు. వారికి సంతానం లేదు. ఒకరికి ఒకరు తోడుగా కొనసాగుతున్న జీవితంలో ఒక్కసారి శూన్యం ఆవరించింది. భర్తను కోల్పోయిన పుట్టెడు శోకం నుంచి కోల్కొని పరిశ్రమలో పనిచేసే కార్మికులే తన పిల్లలుగా, కుటుంబ సభ్యులుగా భావించారు. సమాజ సేవ చేసేందుకు లయనె్‌సక్లబ్‌లో చేరి అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. అంతర్జాతీయ మహిలా దినోత్సవం సందర్భంగా ఆమె ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మహిళలను ప్రోత్సహించడం ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు, తోబుట్టువుల సహకారం ఎంతో అవసరమన్నారు. మహిళా సాదికారికత కోసం మహిళలే ప్రయత్నించాలన్నారు.  ఆడపిల్లలు ముందుడు వేస్తే ప్రతి చోట ప్రోత్సాహం లభిస్తుందని సందేశం ఇచ్చారు.

Updated Date - 2020-03-08T07:37:28+05:30 IST