కరోనాపై అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-03-08T07:20:17+05:30 IST
కరోనాపై ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలను తొలగించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వివిధ జిల్లాలకు చెందిన డీఎంఅండ్‌హెచ్‌వో, డీఎస్‌వో, ప్రోగ్రాం ఆఫీసర్లకు...

- ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలను తొలగించాలి
- వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
మెదక్ అర్బన్, మార్చి 7: కరోనాపై ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలను తొలగించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వివిధ జిల్లాలకు చెందిన డీఎంఅండ్‌హెచ్‌వో, డీఎస్‌వో, ప్రోగ్రాం ఆఫీసర్లకు సూచించారు. శనివారం హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాపించిన నేపథ్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వివరాలు సేకరిస్తుందన్నారు.
ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వైర్‌సపై ఉన్న అపోహలను తొలగించి ప్రజల్లో విస్తృత ప్ర చారం చేపట్టాలన్నారు. ఈనెల 10 మంగళవారం ఉదయం రాష్ట్రంలోని పాఠశాలలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆశాలు, ఏఎన్‌ఎంలు అందరు పాల్గొనాలని ఆదేశించారు. రెండువారాల నుంచి విదేశాలనుంచి వచ్చినవారి జాబితాను త యారు చేయాలన్నారు. వారికి ఏమైనా వ్యాఽ ది లక్షణాలు కనిపిస్తే స్థానిక వైద్యాధికారులకు తెలపాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్‌రావు, డీఎ్‌సవో నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.