స్త్రీ పురుషులు సమాజానికి రెండు కళ్లు

ABN , First Publish Date - 2020-03-08T07:18:36+05:30 IST

స్త్రీపురుషులు సమాజానికి రెండు కళ్లవంటి వారని వాళ్లని, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజా శర్మ అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని ...

స్త్రీ పురుషులు సమాజానికి రెండు కళ్లు

  • అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ
  • వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళలకు  సన్మానం


సిద్దిపేట సిటీ, మర్చి 7: స్త్రీపురుషులు సమాజానికి రెండు కళ్లవంటి వారని వాళ్లని, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజా శర్మ అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని ఎన్జీవోస్‌ భవన్‌లో మహిళ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఎన్జీవోలు సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడారు, లింగవివక్ష చూపకుండా పిల్లల్ని పెంచే బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు. అనంతరం జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ పద్మాకర్‌ మాట్లాడుతూ, వ్యాపార, వాణిజ్య రాజకీయ ఆర్థిక రంగాల్లో మహిళలు రాణించాలన్నారు. గృహిణిగా,  భార్యగా, తల్లిగా మహిళల పాత్ర అమోఘమన్నారు. తమను తాము చిన్న చూపు చూడడం మానాలని హితవు పలికారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, టీఆర్‌ఎస్‌ నాయకులు రాధాకృష్ణ శర్మ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-08T07:18:36+05:30 IST