ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై సీఎం వైఖరి స్పష్టం చేయాలి

ABN , First Publish Date - 2020-03-04T10:30:36+05:30 IST

ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై సీఎం వైఖరి స్పష్టం చేయాలి

ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై సీఎం వైఖరి స్పష్టం చేయాలి

సంగారెడ్డి రూరల్‌, మార్చి 3 : ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై సీఎం కేసీఆర్‌ వైఖరి స్పష్టం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బోస్‌ అన్నారు. సంగారెడ్డిలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై సీఎం మోసపూరిత ప్రకటనలు చేయడం మాని మద్దతునిస్తారా, వ్యతిరేకిస్తారా అనే విషయాన్ని తెలపాలన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమి లేదని, కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ పేదలపై మోయలేని భారాన్ని మోపుతున్నదని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జలాలొద్దీన్‌, నాయకులు షఫీ, ఎం.రహ్మన్‌, గంగయ్య, సునీల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-03-04T10:30:36+05:30 IST