భవిష్యత్‌ తరాల కోసమే మాస్టర్‌ప్లాన్‌

ABN , First Publish Date - 2020-12-11T06:13:07+05:30 IST

భవిష్యత్‌ అవసరాలను దృష్టిల ఉంచుకునే కోసం పట్టణంలో మాస్టర్‌ప్లాన్‌ రోడ్డు నిర్మిస్తున్నామని మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ అన్నారు.

భవిష్యత్‌ తరాల కోసమే మాస్టర్‌ప్లాన్‌
మాస్టర్‌ప్లాన్‌ రోడ్డుకు భూమిపూజ చేస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌

మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి


మెదక్‌ మున్సిపాలిటీ, డిసెంబరు 10: భవిష్యత్‌ అవసరాలను దృష్టిల ఉంచుకునే కోసం పట్టణంలో మాస్టర్‌ప్లాన్‌ రోడ్డు నిర్మిస్తున్నామని మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ అన్నారు. మెదక్‌ పట్టణం నర్సుఖేడ్‌ శివారులో మాస్టర్‌ప్లాన్‌ రోడ్డు విస్తరణ పనులకు ఆయన ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డితో కలిసి గురువారం భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ పట్టణం వేగంగా విస్తరిస్తున్నందున కొత్తగా వెలసిన కాలనీలకు అనుగుణంగా రహదారులు నిర్మించాల్సిన అవసరముందన్నారు. రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయేవారికి అన్నివిధాలుగా న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్‌ సిబ్బందికి పనులు వేగంగా పూర్తయ్యేందుకు వారు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బట్టి జగపతి, కమిషనర్‌ శ్రీహరి, డీఈ మహే్‌షకుమార్‌, కౌన్సిలర్‌ సుంకయ్య, నాయకులు చింతల నర్సింహులు, టీపీఎస్‌ దేవరాజు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-12-11T06:13:07+05:30 IST