మాసాయిపేట మండలం ఉత్తర్వులతో సంబురాలు

ABN , First Publish Date - 2020-12-25T05:54:55+05:30 IST

మాసాయిపేట కొత్త మండలంగా ఏర్పాటైంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం జీవో నంబరు 152 జారీ చేశారు. తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌లో కొత్త మండలంగా మాసాయిపేట ఏర్పాటు చేయగా, జిల్లాలో మండలాల సంఖ్య 21 చేరుకున్నది. దశాబ్ద కాలంగా మండలం ఏర్ఫాటు చేయాలన్న గ్రామస్థుల కల ప్రభుత్వ ఆదేశాలతో గురువారం నెరవేరింది.

మాసాయిపేట మండలం ఉత్తర్వులతో సంబురాలు

తూప్రాన్‌/వెల్ధుర్తి, డిసెంబరు 24: మాసాయిపేట కొత్త మండలంగా ఏర్పాటైంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం జీవో నంబరు 152 జారీ చేశారు. తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌లో కొత్త మండలంగా మాసాయిపేట ఏర్పాటు చేయగా, జిల్లాలో మండలాల సంఖ్య 21 చేరుకున్నది. దశాబ్ద కాలంగా మండలం ఏర్ఫాటు చేయాలన్న గ్రామస్థుల కల ప్రభుత్వ ఆదేశాలతో గురువారం నెరవేరింది. వెల్దుర్తి మండలంలోని మాసాయిపేటను రెవెన్యూ మండలంగా ఏర్పాటు చేస్తు తొమ్మిది రెవెన్యూ గ్రామాలను మండలంలో చేర్చారు. వెల్దుర్తి మండలంలో మాసాయిపేట, అచ్చంపేట, హకీంపేట, కొప్పులపల్లి, రామాంతాపూర్‌, లింగారెడ్డిపల్లి, చేగుంటల మండలంలోని పోతన్‌శెట్టిపల్లి, పోతాన్‌పల్లి, చెట్లతిమ్మాయిపల్లి రెవెన్యూ గ్రామాలను చేర్చారు. మండల ఏర్పాటుపై రాజకీయ నాయకులు, యువకులు హర్షం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ రాములుగౌడ్‌, సర్పంచు మధుసూదన్‌రెడ్డి, మాజీ సర్పంచు నాగరాజు, ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకుడు యాదగిరిమాదిగ, పలు పార్టీల నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. Read more