వెలవెలబోయిన తూప్రాన్‌ టోల్‌ప్లాజా

ABN , First Publish Date - 2020-03-23T06:59:42+05:30 IST

జనతా కర్ఫ్యూతో ప్రజలు, వాహనాలు రోడ్డెక్కలేదు. దీంతో రోడ్లన్నీ జనాలు, వాహనాలు లేక బోసిపోయి నిర్మానుష్యంగా కనిపించాయి. నిత్యం వేలాది వాహనాలు తిరిగే టోల్‌గేట్‌...

వెలవెలబోయిన తూప్రాన్‌ టోల్‌ప్లాజా

తూప్రాన్‌, మార్చి 22 : జనతా కర్ఫ్యూతో ప్రజలు, వాహనాలు రోడ్డెక్కలేదు. దీంతో రోడ్లన్నీ జనాలు, వాహనాలు లేక బోసిపోయి నిర్మానుష్యంగా కనిపించాయి. నిత్యం వేలాది వాహనాలు తిరిగే టోల్‌గేట్‌ వద్ద వందలోపే వాహనాలు కనిపించాయి. తూప్రాన్‌ టోల్‌ప్లాజాలోని 6 బూత్‌లో 10 వేల వరకు వాహనాలు ప్రయాణం చేస్తుంటాయని అంచనా. ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూతో కేవలం 100 లోపు వాహనాలే ప్రయాణించినట్లు ప్రకటించారు. టోల్‌గేట్‌ వద్ద వాహనాల రాకపోకలు లేకపోవడంతో సిబ్బంది అక్కడే కూర్చుండి పోగా, కొందరు మొబైల్‌ ఫోన్లలో ఆడుకుంటూ కనిపించారు. 

Updated Date - 2020-03-23T06:59:42+05:30 IST