తాగిన మత్తులో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-11-26T06:30:35+05:30 IST

తాగుడుకు బానిసై ఓ వ్యక్తి విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు.

తాగిన మత్తులో వ్యక్తి ఆత్మహత్య

తూప్రాన్‌, నవంబరు 25: తాగుడుకు బానిసై ఓ వ్యక్తి విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా రాజుపాలెంకు చెందిన కన్నా వెంకట్రావు కుటుంబం 20 ఏళ్ల క్రితం ఉపాధి కోసం తూప్రాన్‌కు వచ్చి నివసిస్తున్నారు. వెంకట్రావుతో పాటు అతడి కుమారుడు కన్న గంగరాజు(35)కూడా ఇంట్లో ఇడ్లీలు చేసి సైకిళ్లపై తిరుగుతూ విక్రయిస్తుంటారు. కాగా గంగరాజు తాగుడుకు బానిసై వ్యాపారం చేయలేని స్థితికి చేరుకున్నాడు. మంగళవారం తాను ఇడ్లీ వ్యాపారం చేస్తానంటూ కోరగా ఇంటి వద్దనే ఉండాలంటూ తండ్రి నచ్చజెప్పాడు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన గంగరాజు తాగిన నిషాలో విషం సేవించి అస్వస్థతకు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో అతడిని తూప్రాన్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి కుమారుడు ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2020-11-26T06:30:35+05:30 IST