లాక్‌డౌన్‌ నిర్లక్ష్యంపై చర్యలు

ABN , First Publish Date - 2020-03-25T12:50:25+05:30 IST

సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో సోమవారం లాక్‌డౌన్‌ను ప్రజలు బేఖాతరు చేయడంపై పోలీసులు, అధికారులు సీరియ్‌సగా స్పందించారు. మంగళవారం కఠిన చర్యలు తీసుకున్నారు. అయినా పలువురు వీధుల్లో గుమికూడి ముచ్చట్లు

లాక్‌డౌన్‌ నిర్లక్ష్యంపై చర్యలు

సిద్దిపేట, మార్చి24: సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో సోమవారం లాక్‌డౌన్‌ను ప్రజలు బేఖాతరు చేయడంపై పోలీసులు, అధికారులు సీరియ్‌సగా స్పందించారు. మంగళవారం కఠిన చర్యలు తీసుకున్నారు. అయినా పలువురు వీధుల్లో గుమికూడి ముచ్చట్లు పెట్టడంతో స్థానికులు స్పందించి అవగాహన కల్పించారు. పాత కూరగాయల మార్కెట్‌లో అధిక ధరలకు కూరగాయలను విక్రయించడంపై ఫిర్యాదులు రావడంతో అధికారులు మూసివేయించారు. కొత్త మార్కెట్లలో ధరలను నియంత్రించడంతో తక్కువ ధరలకే కూరగాయల లభించాయి.

Read more