టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల దుర్మార్గాలను ఎండగడతాం

ABN , First Publish Date - 2020-12-27T05:38:53+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భూఆక్రమణలు పేట్రేగిపోతున్నాయని, చేర్యాల పెద్ద చెరువు మత్తడి ఆవరణ స్థల దురాక్రమణపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీరుపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జీ.నాగయ్య అన్నారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల దుర్మార్గాలను ఎండగడతాం
చేర్యాల పెద్దచెరువు మత్తడి స్థలాన్ని పరిశీలిస్తున్న సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు నాగయ్య

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జీ.నాగయ్య

చేర్యాల, డిసెంబరు 26 : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భూఆక్రమణలు పేట్రేగిపోతున్నాయని, చేర్యాల పెద్ద చెరువు మత్తడి ఆవరణ స్థల దురాక్రమణపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీరుపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జీ.నాగయ్య అన్నారు. శనివారం చేర్యాల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చేర్యాలలో పూర్వం నుంచి పెద్ద చెరువు మత్తడి ఆవరణ స్థలాన్ని నీటి పారకం కోసమే పట్టాదారులు వదిలిపెట్టగా.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆక్రమణ చేయడం తగదన్నారు. సంబంఽధిత స్థలాన్ని మున్సిపాలిటీ అప్పగించాలని ప్రజలు న్యాయసమ్మతంగా ఆందోళనలు సాగిస్తున్నారని, ఈ విషయంపై అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. చెరువు మత్తడిస్థలాన్ని మున్సిపాలిటీకి అందించాలని, లేకపోతే ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. అనంతరం పెద్దచెరువు మత్తడి ఆవరణ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, నాయకులు రాళ్లబండి శశిధర్‌, పోలోజు శ్రీహరి, కొంగరి వెంకట్‌మావో, రాళ్లబండి నాగరాజు, ఆముదాల నర్సిరెడ్డి, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-27T05:38:53+05:30 IST