వక్ఫ్‌ భూములు అమ్మినా.. కొన్నా నేరం : ఖాసిమ్‌

ABN , First Publish Date - 2020-12-30T05:57:40+05:30 IST

నర్సాపూర్‌, డిసెంబరు 29: వక్ఫ్‌ భూములను అమ్మినా.. కొన్నా నేరమని, వాటిపై సర్వహక్కులు వక్ఫ్‌ బోర్డుకే ఉంటాయని బోర్డు ఓఎ్‌సడీ మహ్మద్‌ఖాసిమ్‌ తెలిపారు.

వక్ఫ్‌ భూములు అమ్మినా.. కొన్నా నేరం  : ఖాసిమ్‌

నర్సాపూర్‌, డిసెంబరు 29: వక్ఫ్‌ భూములను అమ్మినా.. కొన్నా నేరమని, వాటిపై సర్వహక్కులు వక్ఫ్‌ బోర్డుకే ఉంటాయని బోర్డు ఓఎ్‌సడీ మహ్మద్‌ఖాసిమ్‌ తెలిపారు. నర్సాపూర్‌లో వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం వక్ఫ్‌ భూములను ఆయన పరిశీలించారు. నర్సాపూర్‌లో వివిధ సర్వే నంబర్లలో 43.17ఎకరాల వక్ఫ్‌ భూములున్నాయని తెలిపారు. ఇందులో కొంత భూమి ఆక్రమణకు గురైనట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు పరిశీలించినట్లు చెప్పారు. సమగ్ర సమాచారం కోసం త్వరలోనే రెవెన్యూ, వక్ఫ్‌ బోర్డు సంయుక్తంగా సర్వే చేస్తామన్నారు. ఆక్రమణలు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వక్ఫ్‌ భూముల్లో కొన్ని ఇళ్ల నిర్మాణాలతో పాటు కల్లుదుకాణం, పలు ఇతర వాణిజ్య దుకాణాలు ఉన్నట్లు ఫిర్యాదు వచ్చాయని, నిర్మాణాలు జరిపిన వారికి త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని వెల్లడించారు. ఆయన వెంట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నయీమొద్దీన్‌, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ హబీబ్‌ఖాన్‌, కాంగ్రెస్‌ నాయకులు రిజ్వాన్‌, రషీద్‌, మాజీ జడ్జీ కోఆప్షన్‌ గులాం అహ్మద్‌ ఉన్నారు. ఇదిలా ఉండగా వక్ఫ్‌ భూములను బోర్డు ఓఎ్‌సడీ మహ్మద్‌కాసిమ్‌ పరిశీలిస్తున్న సమయంలో.. ఆక్రమణలు జరిగాయని ఫిర్యాదు చేసిన వారికి, నిర్మాణాలు జరిపారని ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి వాగ్వాదం జరిగింది. వారిని స్థానికులు శాంతింపజేశారు.Updated Date - 2020-12-30T05:57:40+05:30 IST