బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కేవల్‌కిషన్‌

ABN , First Publish Date - 2020-12-27T05:48:57+05:30 IST

చిన్నశంకరంపేట, డిసెంబరు 26: కేవల్‌ కిషన్‌ వర్ధంతిని వచ్చే ఏడాది నాటికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారికంగా

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కేవల్‌కిషన్‌
చేగుంటలో మాట్లాడుతున్న బండ ప్రకాష్‌

 కేవల్‌ కిషన్‌ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా కృషి చేస్తాం

 ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ప్రకాష్‌ 


చిన్నశంకరంపేట, డిసెంబరు 26: కేవల్‌ కిషన్‌ వర్ధంతిని వచ్చే ఏడాది నాటికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా కృషి చేస్తానని ముదిరాజ్‌ సంఘం మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్‌ అన్నారు. శనివారం చేగుంట మండలం పొలంపల్లి గ్రామశివారులో కేవల్‌ కిషన్‌ 60వ వర్ధంతి సందర్భంగా ముదిరాజ్‌ సంఘం మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్‌, ఎమ్మెల్సీ శేరి శుభా్‌షరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేవల్‌ కిషన్‌ నైజాం కాలంలో పెత్తందారులు, జాగీరుదారులను అణిచివేసేందుకు పోరాటం చేశాడన్నారు. ఆయన ఎప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశాడని పేర్కొన్నారు. తహసీల్దార్‌ ఉద్యోగానికి రాజీనామ చేసి పేద ప్రజల కోసం త్యాగాలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లోని పేదల హక్కుల కోసం పోరాడి త్యాగాలు చేశాడని కొనియడారు. ఆయన సమాధి వద్ద అభివృద్ధి జరిగేందుకు ఈసీడీబీ ఫండ్‌ నుంచి రూ.10లక్షలు మంజూరు చేస్తానని హామీనిచ్చారు. ఆయన సమాధి వద్ద బోనాల బండ్లను ఊరేగించారు. కార్యక్రమంలో కేవల్‌ కిషన్‌ కుటుంబసభ్యులు, ముదిరాజ్‌ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మహానీయుడు కేవల్‌ కిషన్‌

మెదక్‌ రూరల్‌ :  బడుగు, బలహీన వర్గాల పక్షాన కేవల్‌ కిషన్‌ పోరాటం చేశాడని సీపీఎం జిల్లా కార్యదర్శి  మల్లేశం పేర్కొన్నారు. శనివారం కేవల్‌ కిషన్‌ 61వ వర్ధంతి సందర్భంగా మెదక్‌ జిల్లా కేంద్రంలోని రాందాస్‌ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  రాచరిక పాలనలో జమిందారుల ఆగడాలకు బలవుతున్న వారి పక్షాన కేవల్‌ కిషన్‌ పోరాటం చేశారని గుర్తు చేశారు.  నిజాం  సర్కారుపై పోరాటం చేసి జనం కోసం ప్రాణాలు విడిచాడన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బస్వరాజ్‌, నాగరాజు, సంతోష్‌ నాయక్‌, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్‌కుమార్‌, నాయకులు చింటూ, వరుణ్‌, నాని పాల్గొన్నారు. 

పాపన్నపేటలో ..

పాపన్నపేట : పాపన్నపేటలో మండల ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో శనివారం కేవల్‌ కిషన్‌  వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్‌ వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు ముశెట్టి కిష్టయ్య మాట్లాడుతూ బడుగు, బలహీనుల పక్షాన పోరాడిన నాయకుడు కేవల్‌ కిషన్‌ అని అన్నారు.  కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సొంగ దుర్గయ్య, బాచారం సర్పంచ్‌ వెంకట్‌ రాములు, మల్లంపేట గ్రామ ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడుు బుడిమే సత్యనారాయణ, నాయకులు  పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T05:48:57+05:30 IST