కేసీఆర్ మాటలు నీటి మీద రాతలు
ABN , First Publish Date - 2020-12-15T05:45:56+05:30 IST
సిద్దిపేట క్రైం, డిసెంబరు 14 : సీఎం కేసీఆర్ మాటలు, హామీలు నీటి మీద రాతలుగా ఉన్నాయని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి
సిద్దిపేట క్రైం, డిసెంబరు 14 : సీఎం కేసీఆర్ మాటలు, హామీలు నీటి మీద రాతలుగా ఉన్నాయని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్లపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తున్నదని విమర్శించారు. ప్రతి ఐదేళ్లకోసారి మారిన జీవన పరిస్థితులు, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధ్యాయుల వేతన సవరణ కోసం నియమించిన కమిటీ మూడేళ్లయినా రిపోర్టు సబ్మిట్ చేయకపోవడం సిగ్గు చేటని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఆరునెలలకోసారి ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో రెండు లక్షలపైగా ఉద్యోగ ఖాళీలు ఉంటే వీటిలో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురే్‌షగౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్, పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివా్‌సయాదవ్, రోశయ్య, బాలకృష్ణారెడ్డి, బాలే్‌షగౌడ్, నందాల శ్రీనివాస్, నరసింహారెడ్డి, గుండ్ల జనార్ధన్, సుభా్‌షరెడ్డి, భిక్షపతి, శివ పాల్గొన్నారు.