బంగారు భారత్‌ నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం

ABN , First Publish Date - 2020-02-16T06:57:00+05:30 IST

బంగారు భారత్‌ నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం

బంగారు భారత్‌ నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం

  • దేశంలో బీజేపీ హవా తగ్గిపోతున్నది
  • ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్‌దే విజయం 
  • తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ  చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి


గజ్వేల్‌, ఫిబ్రవరి 15: బంగారు భారత్‌ నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పన్యాల భూపతిరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీ హావా తగ్గిపోతుందని, ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓడిపోతోందన్నారు. బీజేపీ ప్రజావ్యతిరేఖ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. బ్యాంకుల విలీనంతో చేసి బ్యాంకింగ్‌ రంగాన్ని దెబ్బతీశారని, ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌, ఎల్‌ఐసీలను ప్రైవేటు పరం చే స్తున్నారన్నారు. దీంతో ప్రజలు బీజేపీపై తీవ్ర వ్యతిరేఖతతో ఉన్నారన్నారు. బంగారు తెలంగాణ రూపకర్త కేసీఆర్‌తోనే బంగారు భారత్‌ సాధ్యపడుతుందన్నారు. సంక్షేమ పథకాల ఫలితంగానే తెలంగాణలో ఎన్నికలేవైనా విజయం టీఆర్‌ఎస్‌ సొంతమవుతోందన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో 78 సొసైటీ డైరెక్టర్లకు గాను 76 చోట్ల టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నారన్నారు. 6 సొసైటీల చైర్మన్‌ పదవులు టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే వచ్చాయన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపును సీఎం కేసీఆర్‌ జన్మదిన బహుమతిగా ఇచ్చామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ప్రతి గ్రామంలో 200 మొక్కలను నాటాలని, అన్నదానం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం భూపతిరెడ్డి మాట్లాడుతూ ప్రజల మద్దతుతోనే నియోజకవర్గంలో మునిసిపల్‌, పీఏసీఎస్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు డాక్టర్‌ యాదవరెడ్డి, ఎంపీపీ దాసరి అమరావతి, జడ్పీటీసీ పంగ మల్లేశం, మునిసిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకియోద్దీన్‌, నాయకులు సాయిరెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, వెంకటేశ్‌గౌడ్‌, ఖాజావిరాసత్‌అలీ, శ్రీనివాస్‌, రవీందర్‌రావు, కౌన్సిలర్లు  గోపాల్‌రెడ్డి, మెట్టయ్య, రజిత, బాలేష్‌, శ్రీనివాస్‌, బాలమణి, రహమాన్‌, భాగ్యలక్ష్మీ, నాయకులు ఎల్లయ్య, బీమప్ప, హన్మంతరెడ్డి, రమేశ్‌, అహ్మ ద్‌, శ్రీనివా్‌సరెడ్డి, మల్లేశ్‌గౌడ్‌, అశోక్‌, వేణు, బాలయ్య, పోచయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-16T06:57:00+05:30 IST